ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగమ్మాయిల ఉనికి అంకెల్లో ఉండేది. ఇప్పుడు సంఖ్యలోకి మారింది. అన్ని అడ్డంకులూ దాటుకొని వరుస విజయాలతో దూసుకుపోతూ సినీ ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. అలాంటి ఓ అమ్మాయే నటి కోమలి.
యాక్టర్‌గా మారిన డాక్టర్ తను. వైజాగ్‌లో పుట్టి, బళ్లారిలో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ‘నేను సీతాదేవి’ అనే తెలుగు చిత్రంతో 2016లోనే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కోమలి. తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్’, ‘సెబాస్టియన్ పిసి524’, ‘రౌడీ బాయ్స్’ సినిమాల్లోనూ చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
‘హిట్– 2’ చిత్రం కోమలి సినీ జర్నీ స్పీడ్‌ను పెంచింది. ఆ సినిమా మంచి విజయం సాధించటంతో సహాయ ప్రాతల నుంచి ప్రధాన పాత్రల అవకాశాలు ఆమె దరి చేరాయి.
ఆ ఉత్సాహంతోనే ‘లూజర్’, ‘లూజర్–2’ సిరీస్‌లలో నటించి వెబ్ దునియాలోనూ వేగం పెంచింది.ప్రస్తుతం ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ అనే ఆంథాలజీ సిరీస్‌తో అలరిస్తోంది. కోమలి హీరోయిన్‌గా నటించిన ‘శశివదనే ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది..
నన్ను అందరూ స్టార్‌లా కాకుండా ఓ మంచి నటిగా గుర్తించుకోవాలన్నదే నా లక్ష్యం! – కోమలి ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment