హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ప్రతి అప్‌డేట్ ప్రపంచవ్యాప్త సినీ ప్రేమికులకు ఆసక్తికరంగా అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు ‘గోల్డ్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో బలంగా వినిపిస్తోంది. గతంలో ‘మహారాజా’, ‘మహారాజ్’ వంటి పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ‘గోల్డ్’ టైటిల్ వినిపిస్తోంది.
ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ప్రధాన కథాంశం ఓ నిధి వేట అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘గోల్డ్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారనే వార్త రావడంతో నిధి నేపథ్యం కాబట్టి ఈ టైటల్‌నే ఖరారు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారని, హైదరాబాద్‌లో సెట్ వర్క్ జరుగుతోందని, జర్మనీలో కొంత చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలుస్తోంది. షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించాలనుకుంటున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment