మనోజ్ భాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జొరమ్. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు ఎగరేసుకుపోయింది. ఈ సూపర్ హిట్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అద్దె పద్ధతిన అందుబాటులో ఉంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ మూవీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.
సైకిల్ కొనేందుకు కూడా
తాజాగా ఈ మూవీ దర్శకనిర్మాత దేవశిష్ మఖిజ తను ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టాడు. 'నాకిప్పుడు 40 ఏళ్లు. కనీసం ఒక సైకిల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బుల్లేవు. నేను తీసిన సినిమాలతో నేను కొంచెం కూడా డబ్బు కూడబెట్టుకోలేకపోయాను. ఇప్పటికీ అద్దె కట్టడానికి కష్టపడుతున్నాను. జొరమ్ మూవీ వల్ల నాకు లాభాలు రావడం కాదు కదా.. ఏకంగా దివాలా తీశాను. గత ఐదు నెలలుగా అద్దె కట్టడం లేదు. నన్ను ఇంటి నుంచి గెంటేయొద్దని మా ఓనర్‌ను వేడుకుంటున్నాను. కళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే ఇదిగో ఇలాంటి మూల్యమే దక్కుతుంది' అని బాధపడ్డాడు.
రూ.1 కోటి పెడితే..
కాగా దేవశిష్ కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతున్నాడు. 2017లో అతడు అజ్జి అనే సినిమా తీశాడు. రూ.1 కోటి రూపాయలతో సినిమా తీయగా పెట్టుబడి అయినా వెనక్కు వస్తుందనుకున్నాడు. కానీ రూ.15 లక్షలు మాత్రమే వచ్చాయి. మొన్నటికి మొన్న జొరమ్ సినిమాతో నిండా మునిగిపోయాడు. తను నమ్ముకున్న కళ కోసం జీవితంలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు డైరెక్టర్. ప్రస్తుతం తన చేతిలో 20 స్క్రిప్టులదాకా ఉన్నాయని.. కానీ దాన్ని సినిమాగా మలిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వాపోయాడు.
చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సేవ్ ద టైగర్స్ 2 సిరీస్ ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment