Jr Ntr Family Visits Tirumala: జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శనంలో ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ మినహా మిగతా కుటుంబ సభ్యులు కనిపించారు. ప్రస్తుతం తారక్ ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్టీఆర్,రామ్‌చరణ్ ఇందులో మల్టీస్టారర్లుగా నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment