JR NTR Shares Ramcharan Birthday Celebrations - Sakshi
Sakshi News home page

Jr NTR: అర్ధరాత్రి 12 గంటలకు చరణ్‌ ఇంటి ముందుకొచ్చేవాడు: జూనియర్‌ ఎన్టీఆర్‌

Published Wed, Mar 16 2022 8:03 PM | Last Updated on Thu, Mar 17 2022 8:19 AM

JR NTR Shares Ramcharan Birthday Celebrations - Sakshi

RRR Movie: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వచ్చే వారం, మార్చి 25న రిలీజ్‌ కానుంది. ఇందులో కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరిస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ సందడి చేయనున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడిన తరుణంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ఇందులో చెర్రీతో తనకున్న అనుబంధాన్ని బయపెట్టాడు తారక్‌.

'మేమిద్దం చాలా మంచి ఫ్రెండ్స్‌. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా, అలా మేమిద్దరం కలిసిపోయాం. మార్చి 26న నా భార్య లక్ష్మీప్రణతి బర్త్‌డే. మార్చి 27న చరణ్‌ బర్త్‌డే. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. ఎవరికీ తెలియని విషయమేంటంటే.. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చరణ్‌ కారు రాగానే అందులో ఎక్కేసి వెళ్లిపోయేవాడిని. ప్రణతి ఫోన్‌ చేసి 'నా బర్త్‌డే, నువ్వెక్కడున్నావ్‌?' అంటే పన్నెండు దాటింది, నీ బర్త్‌డే అయిపోయింది అని చెప్పేవాడిని' అంటూ చరణ్‌ పుట్టినరోజును ఎలా సెలబ్రేట్‌ చేసుకునేవారో సరదాగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌.

చదవండి: RRR Movie: 'ఆర్‌ఆర్ఆర్' సినిమా కోసం ఆ రాష్ట్ర సీఎం !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement