
దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు.
నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కుని ఎవరికి చూపించాలని లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత మధురమైన నా కూతురి నవ్వును మీతో పంచుకుంటున్నాను. మిస్ యూ నైసాదేవ్‌గణ్’ అంటూ రాసుకొచ్చింది కాజోల్. కాజోల్ పంచుకున్న ఫోటోలో నైసా ట్రెడిషనల్ లుక్‌లో చిరునవ్వు చిందిస్తూ ఉంది. కరోనా బారిన పడిన కాజోల్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.