Kangana Ranaut Talks About Marriage Plans, Says I Do Want To Get Married Have My Own Family - Sakshi
Sakshi News home page

Kangana Ranaut On Marriage Plans: మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలనుంది, కానీ టైం కలిసి రావాలిగా..

Published Fri, Jun 16 2023 9:26 PM | Last Updated on Sat, Jun 17 2023 10:56 AM

Kangana Ranaut Talks About Marriage Plans, Wants Own Family - Sakshi

నాకు పెళ్లి చేసుకోవాలనుంది. నాకంటూ సొంత కుటుంబం ఏర్పరుచుకోవాలని ఉంది. కానీ నేను తొందరపడితే అది జరగదు. ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరిగి తీరు

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు పెళ్లి చేసుకోవాలనుందట. ఇంకెన్నాళ్లు బ్యాచ్‌లర్‌గా ఉండాలనుకుందో ఏమో కానీ మెడలో మూడు  ముళ్లు వేయించుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలనుందట. ఈ విషయాన్ని కంగనాయే స్వయంగా చెప్పుకొచ్చింది. 'ఏది అప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే జరుగుతుంది. నాకు పెళ్లి చేసుకోవాలనుంది. నాకంటూ సొంత కుటుంబం ఏర్పరుచుకోవాలని ఉంది. కానీ నేను తొందరపడితే అది జరగదు. ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరిగి తీరుతుంది' అని చెప్పుకొచ్చింది.

కాగా గతంలోనూ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. 'ధాకడ్‌ సినిమాలో ఉన్నట్లు రియల్‌ లైఫ్‌లో టామ్‌ బాయ్‌గా ఎందుకుంటాను? నేనెందుకు ఇతరులపై చేయి చేసుకుంటాను? అలా ఉంటే నాకింక పెళ్లవుతుందా? మీరిలా నాపై లేనిపోని పుకార్లు సృష్టిస్తే నాకు పెళ్లవడం కష్టమే' అని చెప్పుకొచ్చింది. 

ఇకపోతే కంగనా ప్రస్తుతం టీకూ వెడ్స్‌ షేరు సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖి, అవనీత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కంగనా నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. మరోవైపు ఎమర్జెన్సీ చిత్రంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తోంది. అలాగే పి.వాసు డైరెక్ట్‌ చేస్తున్న చంద్రముఖి 2లోనూ యాక్ట్‌ చేస్తోంది.

చదవండి: బీరు బాటిల్‌తో చేయి కోసుకున్న ప్రభాస్‌ అభిమాని, ఇదెక్కడి అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement