రీసెంట్ టైంలో తెలుగులో పెద్ద సినిమాలు కొన్నింటికి వేకువజామున షోలు పడుతున్నాయి. 'గుంటూరు కారం', 'సలార్', 'దేవర' చిత్రాలు సూర్యుడు రాకముందే ప్రేక్షకుల్ని పలకరించేశాయి. ఇవంటే తెలుగు సినిమాలు కాబట్టి ప్లాన్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు డబ్బింగ్ చిత్రం 'కంగువ' కూడా అదే ఫాలో అయిపోతోంది.
తమిళ హీరో సూర్య చేసిన పాన్ ఇండియా మూవీ 'కంగువ'. నిర్మాత అయితే ఏకంగా రూ.2000 కోట్లు వచ్చేస్తాయనే ధీమాతో ఉన్నారు. బహుశా కంటెంట్‌పై నమ్మకంతో ఇలా అనుండొచ్చు. అయితే ఇప్పుడు అదే నమ్మకంతో ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో వేకువజామున 4 గంటల నుంచే షోలు పడనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థే ట్వీట్ చేసింది.
(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)
కాకపోతే తమిళనాడు ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతి రావాల్సి ఉంది. గతంలో తమిళనాడులోనూ ఎర్లీ మార్నింగ్ షోలు వేసేవారు. కానీ అత్యుత్సాహంతో కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఒకరిద్దరు అభిమానులు చనిపోయారు. అప్పటినుంచి తమిళనాడులో వేకువజామున షోలు వేయట్లేదు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 'కంగువ' కూడా ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్సే 'కంగువ'ని మొదట చూసేస్తారు!
నవంబర్ 14న 'కంగువ' థియేటర్లలోకి రానుంది. అయితే కోర్టులో రిలయన్స్ సంస్థ కేసు పెట్టింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని, అది తిరిగిచ్చేవరకు 'కంగువ' విడుదల నిలుపుదల చేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం ఇది విచారణ సాగుతోంది. ఈ సమస్య పరిష్కారమైతే ఓకే. లేదంటే మాత్రం వాయిదా తప్పదేమో?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నయని పావని ఎలిమినేట్.. ఆ కారణం వల్లే!)
#Kanguva the most expected magnum opus, shows will open in Kerala, Karnataka, Andhra Pradesh & Telangana from 4 am onwards on 14th November.
We have applied with TN Government for early morning shows for 14th & will update once we get the approval for the same.… pic.twitter.com/pMNsDCOG1Z— Studio Green (@StudioGreen2) November 2, 2024
Comments
Please login to add a commentAdd a comment