Karthika Deepam Today Episode June 19th: 9 రోజుల తర్వాత అలా చేస్తా, ప్రియమణికి వివరించిన మోనిత - Sakshi
Sakshi News home page

9 రోజుల తర్వాత అలా చేస్తా: ప్రియమణికి వివరించిన మోనిత

Published Sat, Jun 19 2021 4:25 PM | Last Updated on Sat, Jun 19 2021 7:14 PM

Karthika Deepam Serial: Bhagyalakshmi Decides To Help Karthik And Deepa - Sakshi

కార్తీకదీపం జూన్‌ 19: అబార్షన్‌ చేసుకోమ్మని సర్దిచెప్పడానికి వెళ్లిన కార్తీక్‌కు మోనిత షాక్‌ ఇస్తుంది. కార్తీక్‌నే ఎదోక నిర్ణయం తీసుకోవాలని లేదంటే తానే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. అంతేగాక భార్య స్థానం ఇవ్వమంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్‌ సౌందర్య దగ్గరికి వెళ్లిన చెప్పి సలహా అడుగుతాడు. సౌందర్య తానేం చేయలేనని, నువ్వు తప్పు చేశాడు ఫలితం అనుభవించాల్సిందే అంటూ హితవు పలుకుతుంది. మరీ కార్తీక్‌ మోనిత విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నాడో నేటి(శనివారం) ఎపిసోడ్‌ ఇక్కడ చదవండి..

​​సౌందర్య దగ్గరికి వెళ్లి సలహా అడిగిన కార్తీక్‌కు ఆమె చివాట్లు పెడుతుంది. తానేం చేయలేనని చేతులెత్తెస్తుంది. దీంతో కార్తీక్‌ తిరిగి దీప ఇంటికి వచ్చేస్తాడు. ఉదయం దీప లేచేసరికి కార్తీక్‌ బయట పడుకుని కనిపిస్తాడు. అలా కార్తీక్‌ను చూడటంతో దీప మనసు కరుగుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి తీసుకేళ్లి కార్తీక్‌ను లేపుతుంది. దీప పిలుపుతో కళ్లు తెరిచిన కార్తీక్‌ ఆమెను చూసి ఏంటి ఇంత ఉదయాన్నే రేడి అయ్యావని కంగారు పడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావా? ప్లీజ్‌ దీప అలా చేయకు అని తను తట్టుకోలేనని, పిల్లలు మమ్మీ ఏదని అడిగితే ఏం సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అంటాడు కార్తీక్‌. 

దీంతో దీప ఎక్కడికి వెళ్లడం లేదని, కాస్తా పనుండి బయటకు వెళ్తున్నట్లు చెబుతుంది. అలాగే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదంటూ గంటలో వస్తానని చెబుతుంది. దీంతో కార్తీక్‌ మన కారులో డ్రాప్‌ చేస్తానంటాడు. కానీ దీప వారణాసి ఆటోలో​ వెళ్తానని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప, సౌందర్యలు పార్కులో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మోనిత, ప్రియమణితో కలిసి వాకింగ్‌కు వస్తుంది. అదే సమయంలో మోనిత తొమ్మిది రోజుల తర్వాత తను ఏం చేయనుందో ప్రియమణికి వివరిస్తుంది. దీంతో ప్రియమణి అది జరిగే పని కాదని, దీప, సౌందర్యలు అడ్డుకుంటారనగానే మోనిత అక్కడ దీపను, సౌందర్యను చూస్తుంది. 

సౌందర్య దీపతో కార్తీక్‌ తన దగ్గరికి వచ్చి సలహా అడిగిన విషయం చెబుతుంది. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి వారిని పలకరిస్తుంది. ఆ తర్వాత ‘ఓ కాలమా ఇది నీ గాలమా’ కాలానికి అద్భుతమైన శక్తి ఉంది ఆంటీ అంటూ దీప విజయనగం వెళ్లిన రోజులను గర్తు చేస్తుంది. అంతేగాక హిమను వెతికి పెడితే కార్తీక్‌ తనని పెళ్లి చేసుకుంటానని అడమేంటని, చావుబతుకుల్లో ఉన్న దీపను కార్తీక్ బతికించుకోవడం ఏమిటి? పాపం ఇన్ని చేసిన కార్తీక్‌ను దీప ఛీ కొట్టే పరిస్థితి రావడం ఏంటీ? అంటూ ఇది మోనిత మహత్యం కాదని, కాల మహత్యం అంటుంది. ఇప్పుడు కాలం గాలి రెండూ ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయంటూ విర్ర వీగుతుంది మోనిత. ఆ తర్వాత మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

దీంతో సౌందర్య కార్తీక్‌ చేసిన పనికి కోపం తెచ్చుకుంటూ ఏం చేయాలేని పరిస్థితి తీసుకోచ్చాడని, కాళ్లు చేతులు కట్టేశాడంటూ అహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే నీకు అన్యాయం జరగనివ్వనని, కష్టం కలగనివ్వను అంటుండగా.. దీప తనకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంతుంటుంది అత్తయ్యా తన మాటలతో సౌందర్యను బాధపెడుతుంది. ఇక తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం కార్తీక్‌కు, దీపకు సాయం చేస్తానంటుంది. ఇలాంటి విషయాలను డీల్‌ చేయాలంటే ఆ సౌందర్య, దీప, కార్తీక్‌ ఎవరి వల్ల కాదని తనలాంటి వాళ్ల వల్లే అవుతుంది అంటుంది. నేనోంటో చూపిస్తా అని మురళీ కృష్ణతో చెబుతుంది. 

ఇదిలా ఉండగా కార్తీక్ మొక్కలకు నీళ్లు పడుతుండగా.. పిల్లలు దీప గురంచి అడుగుతారు. బయటికి వెళ్లిందని అనడంతో ఏంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? అని అడుగుతుంది. నిజంగా అమ్మ మీతో​ చెప్పిందా? ఏ గోడకో, చెట్లకో చెప్పిందా అంటూ కార్తీక్‌, దీపలు ఎందుకు మాట్లాడుకోవడం లేదని, దీప తనపై ఎందుకు కోపంగా ఉందని పిల్లలు కార్తీక్‌ను ప్రశ్నిస్తారు. దీంతో​ ప్రశ్నలు ఆపి ఫ్రెష్‌ అయ్యి రండని, టిఫిన్‌ చేసి పెడతా అంటాడు కార్తీక్‌.  దీప వచ్చేసరికి పిల్లలు బయట ఆడుకుంటారు. కార్తీక్‌ అప్పడే టిఫిన్‌ చేస్తాడు. దీపను చూసి నువ్వే వచ్చేసరికి లేటు అవుతుంది తను తినేస్తున్నానని అంటుండగా.. అప్పుడే మోనిత మరీ నాకు అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది సోమవారం నాటి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement