Dada Fame Tamil Actor Kavin To Marry Girlfriend Monica On August 20 - Sakshi
Sakshi News home page

ఒకరితో బ్రేకప్‌.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న యంగ్‌ హీరో, ఆరోజే పెళ్లి!

Aug 2 2023 1:18 PM | Updated on Aug 2 2023 2:02 PM

Kavin to Marry Girlfriend Monica on August 20 - Sakshi

కంటెస్టెంట్‌ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఏమైందో ఏమో కానీ తర్వాత వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

కోలీవుడ్‌ యంగ్‌ హీరో కవిన్‌ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇటీవలే 'దాదా' చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన ఈ యువ హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేయసి మోనికతో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఆగస్టు 20న వీరి వివాహం జరగనుంది. ఇరు కుటుంబాలు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ శుభకార్యం ఘనంగా జరగనుంది. చెన్నైలోనే పెళ్లి మండపాన్ని ఫిక్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

కెవిన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు.. సదరు హీరోకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన ప్రేయసితో కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడెప్పుడు షేర్‌ చేస్తాడా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా.. 'కనా కానమ్‌ కలలాంగల్‌' సీరియల్‌తో కెవిన్‌ జర్నీ మొదలైంది. ఈ సీరియల్‌లో కెవిన్‌ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. శ్రావణన్‌ మీనాక్షి, తాయుమానవన్‌ వంటి సీరియల్స్‌తో బుల్లితెర హీరోగా మారాడు. 2017లో ఇతడు 'శత్రియాన్‌' చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశాడు.

ఆ మరుసటి ఏడాది 'నాట్పున్న ఎన్ననాను తెరియుమా' చిత్రంతో హీరోగా మారాడు. ఈ ఏడాది వచ్చిన 'దాదా'తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఈ చిత్రంతో గణేశ్‌ కె బాబు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లోనూ అదరగొడుతోంది. సీరియల్స్‌, సినిమాలకు మధ్యలో తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు కెవిన్‌.  ఆ సమయంలో షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని లాస్లియా కూడా ధృవీకరించింది. ఏమైందో ఏమో కానీ తర్వాత వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

చదవండి: అలా మాట్లాడొద్దు, నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. ఏడ్చేసిన శివజ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement