RC15 : కియారా అద్వానీ షాకింగ్‌ రెమ్యునరేషన్‌ | Kiara Advanis Shockingly High Remuneration For RC15 | Sakshi
Sakshi News home page

RC15 : కియారా అద్వానీ షాకింగ్‌ రెమ్యునరేషన్‌

Published Thu, Aug 5 2021 9:20 PM | Last Updated on Fri, Aug 6 2021 7:51 AM

Kiara Advanis Shockingly High Remuneration For RC15 - Sakshi

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని ఇటీవలె చిత్ర బృందం ప్రకటించింది. గతంలో వినయ విధేయ రామలో రామ్‌చరణ్‌తో రొమాన్స్‌ చేసిన కియారానే మరోసారి ఆయనతో జత కట్టనుంది. అయితే ఈ సినిమాకు గాను కియారా రూ. 5 కోట్ల  పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందట.

కబీర్‌సింగ్‌ విజయంతో స్టార్‌ హీరోయిన్‌ పాపులారిటీ దక్కించుకున్న కియారా ఇప్పుడు రెమ్యునరేషన్‌ విషయంలో భారీగానే వసూలు చేస్తుందట. ఇది వరకు ఒక్కో సినిమాకు 3.5-4 కోట్ల వరకు వసూలు చేసే కియారా ఇప్పుడు మరో కోటి రూపాయలు అదనంగా పెంచేసిందని టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement