డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. కంటెంట్ బాగుంటే చాలు అది సినిమా అయినా వెబ్‌సిరీస్ అయినా ఆదరణలో ఎటువంటి తేడా వుండదు. ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న పలు వెబ్‌సిరీస్‌లు సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది లాల సలామ్.
ఆరు ఎపిసోడ్లతో పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 25న ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో విడుదల కాబోతుంది. కాగా ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని ట్విటర్ ద్వారా రిలీజ్ చేసి శుభాకాంక్షలు అందజేశాడు. ఈ వెబ్‌సీరిస్ విశేషాల గురించి క్రియేటర్ అండ్ డైరెక్టర్ నాని మాట్లాడుతూ ‘కరోనాతో ఒత్తిడిలో వున్న అందరిని పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్ చేయడమే మా ధ్యేయం'
'దైనందిన జీవితంలో వున్న టెన్షన్‌లను తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురి యువకుల్లో అనుకోకుండా ఒకరు ఓ ల్యాండ్‌మైన్‌పై కాలు మోపుతాడు. అప్పుడు ఏం జరిగింది? వాళ్లు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు? అనేది పూర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా మలిచాం. 40 కొత్త ఆర్టిస్టులతో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాం’ అని తెలిపారు ఈ వెబ్‌సీరిస్‌కు మ్యూజిక్: అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ: రాకేష్ ఎస్ నారాయణ, ఎడిటర్: వెంకటకృష్ణ చిక్కాల, కథ-మాటలు: అర్జున్-కార్తీక్.
చదవండి: ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు నాని సర్‌ప్రైజ్.. పోస్ట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment