
హీరో మంచు మనోజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన రెండో పెళ్లితో హాట్‌టాపిక్ మారిన మనోజ్ రీసెంట్‌గా అన్న మంచు విష్ణు వీడియో షేర్ చేసి ఒక్కసారిగా షాకిచ్చాడు. అప్పటి నుంచి మనోజ్ సోషల్ మీడియా ఖాతాలపై నెటిజన్లు కన్నేస్తున్నారు. దీంతో అతడి ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో అన్నతో వివాదమంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మనోజ్ చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది.
చదవండి: అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నాడంటే..
మై స్వీట్ బ్రదర్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మంచు మనోజ్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. నేడు రామ్ చరణ్ బర్త్‌డే అనే విషయం తెలిసిందే. మార్చి 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ సందర్భంగా మంచు మనోజ్ సైతం చరణ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
చదవండి: ఆ తమిళ స్టార్ హీరోతోనే మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా తన సోదరి మంచు లక్ష్మితో కలిసి రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చూస్తుంటే మంచు లక్ష్మితో కలిసి మనోజ్ చరణ్ బర్త్‌డే సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘మై స్వీటెస్ట్ బ్రదర్, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌కు సూపర్ డూపర్ బర్త్‌డే శుభాకాంక్షలు. నిజంగా చాలా గర్వంగా ఉంది మిత్రమా. ఇంకా ఎన్నో అద్భుతైమన వసంతాలను నువ్వు భవిష్యత్తులో చూడాలని ఆశిస్తున్నా లాట్స్ ఆఫ్ లవ్’అంటూ #HBDGlobalStarRamCharan హ్యాష్ ట్యాగ్ జత చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment