ఘంటసాల నుంచి ఇళయరాజా దాకా, రాజ్ కోటి నుంచి మణిశర్మ దాకా.. దేవిశ్రీ ప్రసాద్ నుంచి థమన్ దాకా..టాలీవుడ్‌ను తమ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు ఎందరో సంగీత దర్శకులు. ఈ మ్యూజిక్ హిస్టరీలో అనూప్ రూబెన్స్‌కు ఒక ప్రత్యేక శైలి, స్థానం ఉంది. ‘జై’ సినిమాతో మొదలైన అనూప్ స్వర ప్రస్థానం పదిహేడేళ్లుగా జైత్రయాత్ర సాగిస్తూనేే ఉంది. ఫాస్ట్ బీట్, మెలొడీ, ఇన్ స్పైరింగ్ సాంగ్స్, పేట్రియాటిక్, ఫోక్ సాంగ్స్..ఇలా పాటల కంపోజిషన్‌లో అనూప్ టచ్ చేయని జానర్ లేదు, మెప్పించని తరహా లేదు. అప్పట్లో క్యాసెట్ల అమ్మకాల్లో ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్లు చూసిన అనూప్.. డిజిటల్ యుగంలో వందల మిలియన్ వ్యూస్ పాటలను అందించి మారిన ట్రెండ్‌లోనూ తన మ్యూజిక్ టాలెంట్‌ను చూపిస్తున్నారు.
‘జై, ధైర్యం’ సినిమాలతో మొదలైన అనూప్ రూబెన్స్ కెరీర్... ‘ప్రేమ కావాలి’ చిత్రంతో మరో మలుపు తిరిగింది. ‘ఇష్క్, లవ్‌లీ, గుండెజారి గల్లంతయ్యిందే, పూలరంగడు, మనం, భీమవరం బుల్లోడు, పిల్లా నువ్వు లేని జీవితం, టెంపర్, గోపాల గోపాల’ చిత్రాలతో రివ్వున పైకి ఎగిరి సంగీత ఆకాశంలో అక్కడే నిలిచిపోయింది. బాలకృష్ణతో పైసా వసూల్, నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా వంటి క్లాస్ హిట్స్ ఇవ్వడం అనూప్‌కే సాధ్యమైంది. పవన్ కల్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు రెండు చిత్రాలకు స్వరాలు అందించారు అనూప్.
కాస్త గ్యాప్ రాగానే ఓ సూపర్ హిట్ ఆల్బమ్‌తో మళ్లీ తన స్వరవేడుక చూపడం ఈ యంగ్ మ్యూజిషియన్‌కు అలవాటు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ఇదే పాటల వేడుక చేశారు. నీలి నీలి ఆకాశం 274 మిలియన్ వ్యూస్ సాధించి, పాండమిక్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. రీసెంట్‌గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో హిట్ కొట్టిన అనూప్...త్వరలో మరిన్ని ఛాట్ బస్టర్స్ ఇవ్వబోతున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ లడ్డుండా ఆల్రెడీ హిట్ ఆల్బమ్ మొదలుపెట్టేశాడు. వెంకీతో దృశ్యం 2, రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మరిన్ని హిట్ ఆల్బమ్స్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు అనూప్.
Comments
Please login to add a commentAdd a comment