జయపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని హీరో నాగచైనత్య. తొలి సినిమా జోష్‌తోనే ప్రయోగం చేశాడు. ఆ తర్వాత వరుసగా లవ్ స్టోరీలు.. కొన్ని మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ.. ఏ ఒక్క జోనర్‌కి పరిమితం కాకుండా ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో కొన్ని బాక్సాపీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ.. అభిమానుల్లో మాత్రం ఆయనకున్న క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు.
ఇక ఈ ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన చైతూ.. తొలిసారి ‘లాల్‌సింగ్ చడ్డా’తో బాలీవుడ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
(చదవండి: సమంతను కలిస్తే ఏం చేస్తారు? నాగ చైతన్య షాకింగ్ ఆన్సర్)
ప్రస్తుతం నాగచైనత్య ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడట. అయితే ‘లాల్ సింగ్ చడ్డా’లో చై స్పెషల్ రోల్ మాత్రమే చేస్తున్నాడు. ఇందుకు గాను నిర్మాతు అతనికి రూ.5 కోట్లు రెమ్యునరేషన్‌గా ఇచ్చారట. మరి ఈ చిత్రంతో చైతన్య పాన్ ఇండియా స్థాయిలో క్లిక్ అవుతాడో లేదో చూడాలి. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వస్తున్న ‘లాల్‌సింగ్ చడ్డా’ ఆగస్ట్11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment