నాగార్జున బర్త్‌డే కోసం.. 20 ఏళ్ల నాటి సినిమా రీ-రిలీజ్‌ | Nagarjuna Mass Movie Re Release Date locked | Sakshi
Sakshi News home page

నాగార్జున బర్త్‌డే కోసం.. 20 ఏళ్ల నాటి సినిమా రీ-రిలీజ్‌

Aug 13 2024 9:28 AM | Updated on Aug 13 2024 9:44 AM

Nagarjuna Mass Movie Re Release Date locked

టాలీవుడ్‌లో ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల లిస్ట్‌లో అక్కినేని నాగార్జున పేరు టాప్‌లో ఉంటుంది. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు రానుంది. దీంతో ఆయన అభిమానుల కోసం 'మాస్‌' సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా, రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.

నాగార్జున సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ తెరకెక్కించిన 'మాస్‌' సినిమా 2004లో విడుదలైంది. సుమారు 20 ఏళ్ల తర్వాత.. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు ఆగష్టు 28న రీ-రిలీజ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా మేకర్స్‌ విడుదల చేశారు.  ఈ సినిమాలో జ్యోతిక, చార్మికౌర్‌, రఘువరన్‌, ప్రకాష్‌రాజ్‌, రాహుల్‌ దేవ్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆరోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించి రికార్డు సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement