
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్పెయిన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌లో భాగంగా మహేశ్ కుటుంబంతో కలిసి స్పెయిన్ పయనమైన సంగతి తెలిసిందే. అక్కడ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. అయితే మహేశ్ షూటింగ్‌తో బిజీ ఉండగా నమ్రత పిల్లలతో కలిసి సమీపంలోని టూరిస్ట్ ప్లేస్‌లను చూట్టేస్తోంది. ఈ క్రమంలో కూతురు సితార, కుమారుడు గౌతమ్‌లతో కలిసి ఆమె స్విజ్జర్లాండ్‌లో పర్యాటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నదిలో పడవలో ప్రయాణం చేస్తూ సరదాగా గడుపుతున్న ఫొటోను నమ్రత తన షేర్ చేసింది. ‘సరస్సు నుంచి వస్తున్న తాజా గాలి, చాలా కాలం తర్వాత ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచలో నాకు ఇష్టమైన ప్రదేశం. మళ్లీ పుట్టినట్టుగా ఉంది. బ్లెస్డ్ మూమెంట్స్’ అంటూ అభిమానులతో పంచుకుంది.
కాగా ఇటీవల భర్త మహేశ్‌తో హాలో మ్యాగజైన్‌కు ఇచ్చిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ ఫొటోలను మహేశ్ షేర్ చేస్తూ ‘ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. నా సూపర్ ఉమెన్‌తో హాలో మ్యాగజైన్ ఇచ్చిన కొన్ని ఫొటోస్టిల్స్ ఇవి’ అంటూ రాసుకొచ్చాడు. కాగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సూరేశ్‌నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment