
టైటిల్: నీ దారే నీ కథ
నటీనటులు : ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్ తదితరులు
దర్శకుడు : వంశీ జొన్నలగడ్డ
రచయితలు : మురళి కాంత్, వంశీ జొన్నలగడ్డ
సంగీతం : ఆల్బర్ట్టో గురియోలి
బ్యానర్ : జె వి ప్రొడక్షన్స్
నిర్మాతలు : వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ
సినిమాటోగ్రాఫర్ : ఎలెక్స్ కావు
కాస్ట్యూమ్ డిజైనర్ : హర్షిత తోట
ఎడిటర్ : విపిన్ సామ్యూల్
విడుదల తేదీ: 14 జూన్ 2024
ప్రియతమ్ మంతిని, సురేష్, అంజన బాలాజీ, విజయ్ విక్రాంత్, వేద్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నీ దారే నీ కథ. అజయ్, పోసాని కృష్ణ మురళి అతిథి పాత్రల్లో నటించగా వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
కథ
అర్జున్ (ప్రియతమ్ మంతిని) తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి మ్యూజిషియన్‌గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం చేయాలనేది అతని కోరిక. తండ్రి (సురేష్) కూడా సపోర్ట్ చేస్తాడు. హీరో అనుకున్నది సాధించే క్రమంలో అతడి ఫ్రెండ్ తన టీమ్ నుంచి తప్పుకుంటాడు. అప్పుడు తనకు సపోర్టుగా శృతి (అంజన బాలాజీ) వస్తుంది. కుమారుడిని మంచి మ్యూజిషియన్ గా చూడాలనుకున్న తండ్రి మధ్యలోనే మరణిస్తాడు. తండ్రి కోరికను అర్జున్ నెరవేర్చాడా? లేదా? అనేది తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ
వంశీ జొన్నలగడ్డ ఎంచుకున్న కథ కొత్తదేం కాదు. కెరీర్‌లో తనకు నచ్చిన పని ఎంచుకుని ఆ రంగంలో నిలబడాలనుకునే యువకుడి కథే ఈ సినిమా. తండ్రి కోటీశ్వరుడైనా కుమారుడి ప్యాషన్‌ను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తుంటాడు. అతడు ఎంత పెద్ద ధనవంతుడైనా బంధువుల సూటిపోటి మాటల్ని మాత్రం తప్పించుకోలేని పరిస్థితుల్ని తెర మీద ఆసక్తికరంగా చూపించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
కొన్నిసార్లు వాసు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాకమానదు. ఈ సినిమాకు ప్రధాన బలమైన బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుతూ ప్రయోగం చేశారు. బీజీఎమ్ కథకు అనుగుణంగా సెట్టయిపోయింది. కొందరు ఆర్టిస్టుల డబ్బింగ్ ఎబ్బెట్టుగా ఉంది. క్లైమాక్స్ ఊహించేట్లుగా ఉంది.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాకి నటుడు సురేశ్ పెద్ద ప్లస్ పాయింట్. కుమారుడి కలల్ని సపోర్ట్ చేసే తండ్రి పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ప్రియతమ్ కొత్తవాడైనా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. విజయ విక్రాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నవ్విస్తూనే ఎమోషన్ పండించాడు. అజయ్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అంజనా బాలాజీ పర్వాలేదనిపించింది.
చదవండి: నన్ను పట్టించుకోలేదు.. అవమానంతో కుంగిపోయా.. రోజూ ఏడ్చేదాన్ని!
Comments
Please login to add a commentAdd a comment