పదకొండు మంది హీరోలలో నిహారిక కొణిదెల కొత్త సినిమా! | Niharika Konidela Upcoming Film With Newcomers Titled Committee Kurrollu | Sakshi
Sakshi News home page

Niharika Konidela: పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లతో ‘కమిటీ కుర్రోళ్లు’

Published Wed, Apr 10 2024 12:04 PM | Last Updated on Wed, Apr 10 2024 12:18 PM

Niharika Konidela Upcoming Film With Newcomers Titled Committee Kurrollu - Sakshi

నటి – నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ ఖరారైంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ పతాకాలపై పద్మజ కొణిదెల, ఫణి, జయలక్ష్మి అడ΄ాక నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా టైటిల్‌ ΄ోస్టర్‌ను హీరో సాయి దుర్గా తేజ్‌ విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ– ‘‘మా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌పై వస్తున్న తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. కొత్తవారితో సినిమా చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లని  పరిచయం చేస్తున్నాం’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు ఫణి, జయలక్ష్మి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement