Pawan Kalyan Upcoming Movie With Khiladi Movie Director Ramesh Varma - Sakshi
Sakshi News home page

మరో సినిమాకు పవన్‌ సైన్‌, ‘ఖిలాడీ’ డైరెక్టర్‌తో నెక్స్ట్‌!

Published Mon, Jan 25 2021 1:29 PM | Last Updated on Mon, Jan 25 2021 4:16 PM

Pawan Kalyan Signs A New Film With Director Varma  - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్‌, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లోనూ పవన్‌ ఓ సినిమాకు సైన్‌ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్‌‌‌, రానా దగ్గుబాటిలు ఓ మల్టిస్టారర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.  (పవన్‌‌ రీ ఎంట్రీ ఖరీదు 300 కోట్లా?)

‘మాళయాళంలో సూపర్‌ హిట్టైన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ మూవీని దర్శకుడు సాగర్‌ కే చంద్ర తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో పవన్‌ పాల్గొన్నారు. ఇప్పుడు  మరో ప్రాజెక్టు చేసేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ ‘ఖిలాడీ’ మూవీ డైరెక్టర్‌ రమేష్‌ వర్మ పవన్‌ కోసం కోసం ఓ కథను రెడీ చేశాడట. స్స్ర్కిప్ట్‌  నచ్చడంతో  ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో షెడ్యూల్‌ గ్యాప్‌లోనే దాదాపు ఏడు సినిమాలు పవన్‌ చేతిలో ఉన్నట్లు సమాచారం. (శంకర్‌ దర్శకత్వంలో పవన్‌, చరణ్‌..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement