
Samantha Ruth Prabhu Dances To Arabic Kuthu Song: తలపతి విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బీస్ట్’. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన అరబిక్ కుతు పాట నెట్టింట సంచలన సృష్టించింది. విడుదలైన కాసేపటికే మిలియన్‌పైగా వ్యూస్ తెచ్చుకుని యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట లిరిక్స్‌యే వినిపిస్తున్నాయి. సామాన్య జనం నుంచి సెలబ్రెటీల వరకు ఈ పాటకు రీల్ చేస్తూ స్టెప్పులేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసింది. షూటింగ్ నేపథ్యంలో ట్రావెల్ చేస్తున్న ఆమె ఎయిరోపోర్ట్‌లో అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఫ్యాన్స్‌తో పంచుకుంది. విరామ సమయంలో ఎయిర్ పోర్ట్‌లో అరబిక్ కుతు సాంగ్‌కి డ్యాన్స్ చేసి.. ‘రాత్రి పూట ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఈ లిరిక్స్‌కు కాలు కదిపాను’ అంటూ విజయ్, పూజా హెగ్డే, అనిరుద్‌తో పాటు బీస్ట్ మూవీ టింను ట్యాగ్ చేసింది.
దీంతో ఈ వీడియో చూసిన పూజ హెగ్డే స్పందిస్తూ.. ‘సామ్.. నువ్వు అద్భుతం. నిజమే, 2022లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయేమో’ అంటూ పోస్ట్ చేసింది. కాగా ఇటీవల పూజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడంపై సమంత, చిన్మయి శ్రీపాద, డైరెక్టర్ నందిని రెడ్డి మధ్య నడిచిన ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. పూజ వ్యాఖ్యలపై వాళ్లు సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత పూజ హెగ్డే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.