
టాలీవుడ్ యంగ్ హీరోలను పెళ్లెప్పుడు? అని అడిగితే ప్రభాస్ తర్వాతే మా పెళ్లి అని తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటిది ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతున్నాడని, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌తో మాల్దీవుల్లో నిశ్చితార్థానికి రెడీ అయ్యాడంటూ గత రెండు, మూడు రోజులుగా పుకార్లు జోరందుకున్నాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై ప్రభాస్ టీమ్ స్పందించింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేసింది. వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టింది.
కాగా ప్రభాస్, కృతిలకు ముడిపెడుతూ డేటింగ్ రూమర్స్ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో భేడియా ప్రమోషన్స్‌లో వరుణ్ ధావన్.. హీరోయిన్ దీపికా పదుకొనేతో షూటింగ్‌లో ఉన్న ఓ హీరో మనసులో కృతి సనన్ పేరు ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పుడు దీపికాతో షూటింగ్‌లో ఉంది ప్రభాసే కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు. దీనిపై స్వయంగా కృతి స్పందిస్తూ.. అవన్నీ వుట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి తనే స్వయంగా చెప్తానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment