
‘కంచె’ మూవీతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికి అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో ఆమెకు హీరో బాలకృష్ణ తాజా చిత్రం ‘బీబీ3’లో నటించే అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రగ్యా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత నేను నటిస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే బాలకృష్ణ సర్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం అనేది అద్భుతమైన విషయం.
ఆయన ఎప్పుడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికి షూటింగ్ సెట్‌లో ఎప్పుడు సందడి చేస్తూ తొటి నటీనటులతో సరదాగా ఉంటారు. చాలా ఎనర్జీటిక్‌గా ఉంటారు. చెప్పాలంటే ఆయన ఎనర్జీ ఓ పవర్ హౌజ్ లాంటింది. ఎప్పుడూ పాజిటివిటీతో ఉంటారు. అందుకే ఆయన నాకు స్ఫూర్తి. ఇక సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి ఎవరూ సాటిరారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఇప్పటికే ‘జయ జానకి నాయక’ మూవీ చేశానని, ఇప్పుడు మళ్లీ ఆయన డైరెక్షన్‌లో నటించడం సులభంగా ఉందన్నారు. దర్శకుడిగా మూవీ పట్ల ఆయనకున్న స్పష్టత, విజన్ ఎంతో స్ఫూర్తిదాయకమైనదని పేర్కొన్నారు.
చదవండి:
బాలయ్య సినిమా నుంచి ఆ ఇద్దరూ ఔట్!
సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్..
Comments
Please login to add a commentAdd a comment