విడుదలకు రెడీ అవుతున్న 'కలి' సినిమా | Prince Kali Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

విడుదలకు రెడీ అవుతున్న 'కలి' సినిమా

Published Mon, Sep 16 2024 4:21 PM | Last Updated on Mon, Sep 16 2024 4:49 PM

Prince Kali Movie Release Date Locked

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా 'కలి'. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో 'రుద్ర క్రియేషన్స్' సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రచనతో పాటు దర్శకత్వం కూడా శివ శేషు వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న విడుదలకు రెడీ అవుతోంది.

'కలి' పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతుంది. ఈ చిత్రంలో  ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement