
ఫ్యాషన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే ప్రియాంక చోప్రా... అప్పుడప్పుడు వింత వింత డ్రెస్సుల్లో దర్శనమిస్తూ ట్రోలింగ్ బారినపడుతుంటారు.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునే నటి ప్రియాంక చోప్రా. నటనలోనే కాదు, డ్రెస్సింగ్ విషయంలోనూ ప్రియాంక స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఫ్యాషన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే ప్రియాంక...అప్పుడప్పుడు వింత వింత డ్రెస్సుల్లో దర్శనమిస్తూ ట్రోలింగ్ బారినపడుతుంటారు. తాజాగా ఈ గ్లోబల్ బ్యూటికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం ప్రియాంక ధరించిన డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ప్రియాంక డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.
ఇటీవలె.. బంతిలా గుండ్రటి ఆకారంలో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్‌ను ధరించిన ప్రియాంక వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కొద్ది సేపటికే అవి వైరల్‌గా మారాయి. దీపావళికి కాల్చే ఫైర్ క్రాకర్స్,హాట్ ఎయిర్ బెలూన్ అంటూ రకరకాలుగా ఆమె డ్రెస్‌ను ట్రోల్ చేసేస్తున్నారు. చివరకు క్రెకటర్ విరాట్ కోహ్లీని కూడా మీమ్స్‌లోకి లాగారు మీమ్ మేకర్స్. ప్రియాంక డ్రెస్ బంతిలా ఉండటంతో విరాట్ కోహ్లీ క్యాచ్ పడుతున్నట్లు మీమ్స్ సృష్టించారు. దీనికి సంబంధించిన మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ట్రోలింగ్‌పై ప్రియాంక చాలా పాజిటివ్‌గా స్పందించింది. తనకు నచ్చిన కొచ్చిన మీమ్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ..ఇవి చాలా ఫన్నీగా ఉన్నాయి.. మీమ్స్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ తన స్టైల్‌లో వారికి బదులిచ్చింది.
చదవండి :
ఆ పాట కోసం దుస్తులు విప్పమన్నారు : ప్రియాంక
స్టార్ హీరోయిన్ బ్యాగు లాగేసిన ఫ్యాన్!
Too funny... Thanks for making my day guys ! @LUXURYLAW #halpernstudio pic.twitter.com/TpEJIUocSJ
— PRIYANKA (@priyankachopra) February 23, 2021
— PRIYANKA (@priyankachopra) February 23, 2021