Dil Raju Reveals about his Love Story with Wife Tejaswini, Deets Inside - Sakshi
Sakshi News home page

Dil Raju Love Story In Telugu: నాకొక తోడు కావాలనిపించింది.. తేజ‍స్వినిని ఏడాదిపాటు అబ్జర్వ్‌ చేశా

Jan 16 2023 2:11 PM | Updated on Jan 16 2023 3:47 PM

Producer Dil Raju Reveals About His Love Story With Wife Tejaswini, Deets Inside - Sakshi

నన్ను అర్థం చేసుకునేవాళ్లు జీవితంలో ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తుందనుకున్నా. ఆ సమయంలో తేజస్విని కలిసింది.

సినిమా తీయాలంటే డబ్బులుంటే సరిపోదు. దానికన్నా ముందు ప్యాషన్‌ ఉండాలి. అలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాత దిల్‌ రాజు. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు. ఇటీవలే ఆయన నిర్మించిన వారసుడు సినిమా బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్‌ రాజు మొదటి భార్య మరణించడంతో చాలాకాలం ఒంటరిగానే ఉన్నాడు. దాదాపు మూడేళ్లు ఒంటరిగా ఉన్న తర్వాత 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడే దిల్‌ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

'నన్ను చూసి వివి వినాయక్‌, ప్రభాస్‌.. అందరూ యాటిట్యూడ్‌ అనుకున్నారు. నాతో కలిసి పని చేశాక అలాంటిదేం లేదని వారికే అర్థమైంది. నా భార్య వైఘారెడ్డి కూడా అలాగే అనుకుంది, కానీ తర్వాత కూల్‌ అని తెలుసుకుంది. నా మొదటి భార్య చనిపోయాక రెండేళ్లపాటు చాలా స్ట్రగులయ్యా. అప్పటికి నా వయసు 47 ఏళ్లు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు రెండు, మూడు ఆప్షన్లు కనిపించాయి. కానీ నేనొక సెలబ్రిటీని.. నన్ను అర్థం చేసుకునేవాళ్లు జీవితంలో ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తుందనుకున్నా. ఆ సమయంలో తేజస్విని కలిసింది. ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నా. సంవత్సరంపాటు ఆమెను అబ్జర్వ్‌ చేశా. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్‌ చేశా. ఇంట్లోవాళ్లను ఒప్పించా. మాకు ఓ బాబు కూడా పుట్టాడు' అని చెప్పుకొచ్చాడు దిల్‌ రాజు.

చదవండి: బాత్రూమ్‌లోకి వెళ్లి గంటన్నరపాటు ఏడ్చా
వాల్తేరు వీరయ్య కలెక్షన్స్‌ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement