
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలై టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. ఇదిలా ఉండగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్‌ను ఇటివల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అగష్టు 13 వ తేదీ ఉదయం 11: 07 గంటలకు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చెప్పినట్టుగా ఈ రోజు మేకర్స్ ‘దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొడుతుంది పీక’ అంటూ సాగే లిరికల్ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో బన్ని మాస్‌లుక్‌తో ఇరగదీశాడు. మునుపెన్నడు లేని విధంగా సరికొత్తగా స్టైలిష్ స్టార్ రెచ్చిపోయాడు. ఇందులో బన్ని యాటిటూడ్‌కు మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కాగా దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment