
Pushpa Movie: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. 'పుష్ప' ఫోర్త్ సింగిల్ లిరికల్ ప్రొమో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా'ను చిత‍్రబృందం విడుదల చేసింది. నవంబర్ 19న ఉదయం 11.07 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే 'పుష్ప' నుంచి విడుదలైన.. దాక్కో దక్కో మేక', ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ 'సామీ సామీ' పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెబంర్ 17, 2021న విడుదల కానుంది. హీరోయిన్ రశ్మిక మందన్నా కాగా, సునీల్, అనసూయ పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.