అలాంటి ప్రేమ కోరుకునే అమ్మాయి కథే ఈ సినిమా | Madhya Pradesh Girl Real Life Incident Based Movie Pyaari Release Date And Other Details - Sakshi
Sakshi News home page

Pyaari Movie: తెలుగు-హిందీలో 'ప్యారీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్

Sep 13 2023 5:23 PM | Updated on Sep 13 2023 6:08 PM

 Pyaari Movie Release Date And Details - Sakshi

మధ్యప్రదేశ్ లో ఓ అమ్మాయి జీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో తీసిన సినిమా 'ప్యారీ'. పలు సూపర్‌హిట్ హిందీ సీరియల్స్, వీడియో ఆల్బమ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న డాలి తోమర్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై కల్పన తోమర్-అమిత్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. రహమాన్ అలి - రాజారామ్ పాటిదార్ సహ నిర్మాతలు.

(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)

పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం.. తెలుగు, హిందీ భాషల్లో అక్టోబరు 27న థియేటర్లలోకి రానుంది. సినిమాగా తీయడానికి ముందే పుస్తక రూపంలో వెలువడి లక్షలాది పాఠకుల మనసులు దోచుకున్న "ప్యారీ" రచయిత రజనీష్ దూబే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు లక్ష్మణ్ పాత్రను పోషించడం విశేషం. ఆర్.పి.సోనితో కలిసి ఈ చిత్రానికి సంగీత సారథ్యం సైతం వహించారు. 

కొన్ని కాలాలపాటు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. చూసేకొద్దీ చూడాలనిపించేలా ఈ మూవీలో సాంగ్స్ ఉన్నాయట. స్వేచ్ఛ, స్వచ్ఛమైన ప్రేమను కోరుకునే ఓ అమ్మాయి మనసును ఎంతో హృద్యంగా ఆవిష్కరిస్తూ తీసిన 'ప్యారీ'.. ఇప్పటివరకు భారతీయ తెరపై రూపొందిన అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని దర్శకుడు రజనీష్ దూబే చెప్పారు.

(ఇదీ చదవండి: బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement