కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఇప్పట్లో షూటింగ్‌లను వెళ్లడం లేదు. పరిస్థితులు చక్కగా అయ్యే వరకు ఇంట్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి పట్టునే తమకు నచ్చిన వ్యాపకాలతో సరదాగా గడుపుతున్నారు. వంటలు, జిమ్, యోగా, ఫిట్‌నెస్, రీడింగ్ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో దానిపై దృష్టి పెడుతున్నారు. ఇదే పనిలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఉన్నారు. అయితే రాశి ఖన్నా హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా సుపరిచితురాలే. (నాతో నేను టైమ్ స్పెండ్ చేస్తున్నా...)
తను నటించిన కొన్ని సినిమాల్లోని పాటలను రాశీ స్వయంగా ఆలపించారు. గత ఏడాది ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలోనూ పాట పాడి అభిమానులను అలరించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో మ్యూజిక్‌పై మరింత ఫోకస్ పెట్టిన రాశి, గిటార్ కూడా నేర్చుకున్నారు. తాజాగా గిటార్ వాయిస్తూ ఉండిపోరాదే (శాడ్ వెర్షన్) అంటూ హూషారు సినిమా పాటను పాడి అభిమానులను అలరించారు రాశీ ఖన్నా. కాగా టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారి రూపొందించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రం ద్వారా రాశి ఖన్నా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, తొలి ప్రేమ. ప్రతి రోజు పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment