నిహారిక పెళ్లి వేడుకల్లో చెర్రీ, బన్నీ.. | Ram Charan, Allu Arjun Family Off to Udaipur For Niharika Marriage | Sakshi
Sakshi News home page

ఉదయ్‌పూర్‌ బయలుదేరిన 'మెగా' ఫ్యామిలీ

Published Mon, Dec 7 2020 5:42 PM | Last Updated on Mon, Dec 7 2020 6:04 PM

Ram Charan, Allu Arjun Family Off to Udaipur For Niharika Marriage - Sakshi

కొణిదెల వారింట పెళ్లి సందడి మెదలైంది. మరో రెండు రోజుల్లో మెగా డాటర్‌ నిహారిక పెళ్లిపీటలు ఎక్కనుంది. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్న నిహారిక-చైతన్యల జంట డిసెంబర్‌ 9 మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా జరగనుంది. పెళ్లిసమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసనతో పాటు అల్లు అర్జున్‌ కుటుంబం ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌ బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి)

మెగా ఫ్యామిలీలో గత కొన్ని రోజలుగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి వేడకలకు  సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. కరోనా కారణంగా బంధువులు, అతికొద్దిమంది ప్రముఖులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. అయితే హైదరాబాద్‌లో నిర్వహించే రిసెప్షన్‌కు మాత్రం కొందరు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. (చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement