Ram Charan Says That He Will Announce His Hollywood Debut Soon - Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న రామ్‌చరణ్‌.. త్వరలోనే అనౌన్స్‌మెంట్‌

Published Thu, Mar 9 2023 9:08 AM | Last Updated on Thu, Mar 9 2023 9:37 AM

Ram Charan Says That He Will Announce His Hollywood Debut Soon - Sakshi

‘సీఈఓ’గా కనిపిస్తారట రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో  రామ్‌చరణ్‌ హీరోగా ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌గా ఇప్పటికే ‘అధికారి’, ‘సర్కారోడు’ వంటి పేర్లు తెరపైకి రాగా తాజాగా ‘సీఈఓ’ తెరపైకి వచ్చింది. ఫైనల్‌ టైటిల్‌ను ఈ ఉగాదికి లేదా రామ్‌ చరణ్‌ బర్త్‌ డే (మార్చి 27)కి ప్రకటిస్తారని టాక్‌. హాలీవుడ్‌కి...  ఆస్కార్‌ బరిలో నిలిచిన ‘నాటు నాటు’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా హాలీవుడ్‌లో తన తొలి సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వెల్లడి కానుందని రామ్‌ చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్‌ యాక్టర్స్‌లో ఒకరైన నటి జూలియా రాబర్ట్స్‌తో నటించాలని ఉందని, ఆమె సినిమాలో గెస్ట్‌ రోల్‌ అయినా ఇష్టమేననీ రామ్‌ చరణ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement