Ram Gopal Varma Shocking Comments On RRR Movie: జక్కన్న రూపొందించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈమూవీపై మొదట్లో ప్రశసంలు కురిపించిన వర్మ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌పై స్పందించాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’తో పోలిస్తే ఆర్‌ఆర్‌ఆర్ మూవీ గేమ్ చేంజర్ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా ఆయన తాజా చిత్రం మా ఇష్టం(డేంజరస్) మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇటీవల ఆర్జీవీ ఓ జాతీయ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ గ్రాండ్ సక్సెస్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది.
చదవండి: సలార్ షూటింగ్ మరింత ఆలస్యం?, మరో నెల విశ్రాంతి మోడ్‌లోనే ప్రభాస్!
ఈ మేరకు ఆర్జీవీ స్పందిస్తూ.. ‘నా ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ మూవీ పెద్ద చిత్రమే అయినప్పటికీ అది గేమ్ చేంజర్ కాదు. ఎందుకంటే ఇది సమాజంలో మార్పు తీసుకువస్తుందని నేను అనుకోను. ఆర్‌ఆర్‌ఆర్ భారీ బడ్జెట్‌తో నిర్మించి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓ రకమైన చిత్రం. ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే మీకు రాజమౌళి లాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు కావాలి’ అన్నారు. అనంతరం ‘అదే ది కశ్మీర్‌ఫైల్స్‌ను చూస్తే. ఇది నిజమైన గేమ్ చేంజింగ్ సినిమా. ఇలాంటి సినిమాలే దర్శక-నిర్మాతలకు కావాల్సిన నమ్మకాన్ని ఇస్తాయి. అంటే రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ. 250 కోట్లు వసూలు చేస్తే ఎలా ఉంటుంది?
చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
అదే ది కశ్మీర్ ఫైల్స్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ రెండూ భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. కానీ నిజమైన గేమ్ చేంజర్ సినిమా మాత్రం ది కశ్మీర్ ఫైల్సే అవుతుంది. ఎందుకంటే కశ్మీర్ ఫైల్స్ తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా వంటి సినిమాలకు పోటీ ఇచ్చింది. ఇలాంటి సినిమాలను నిర్మించడం చాలా సులభం. కానీ ఆర్‌ఆర్‌ఆర్ అలా కాదు. దీనికి ఎక్కువ బడ్జెట్ అవసరం. ప్రతి నిర్మాత రూ. 500 కోట్లు పెట్టకపోవచ్చు. కానీ, రూ.10 కోట్లు అయితే వెచ్చించగలడు కదా’ అంటూ ఆర్జీవీ వివరణ ఇచ్చాడు. కాగా లెస్బియన్ నేపథ్యంలో రూపొందించిన ఆర్జీవీ మా ఇష్టం(డేంజరస్) మూవీ ఏప్రిల్ 8న విడుదల కావాల్సి ఉండగా పలు వివాదాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment