బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ లెటెస్ట్ మూవీ 'షంషేరా'. 'సంజు' మూవీతో అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్ అనంతరం రణ్‌బీర్ నటించిన యాక్షన్ డ్రామా ఇది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం పొందింది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం(జూలై 22) హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రణ్‌బీర్ కెరీర్‌లోనే లోయెస్ట్ ఒపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా 'షంషేరా' నిలిచింది.
చదవండి: లైగర్ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్, డిజిటల్ రైట్స్? ఎంతంటే..
దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ కోవిడ్ అనంతరం బాలీవుడ్‌లో అత్యథిక థియేటర్లో రిలీజైన మూవీగా నిలిచింది. కానీ కలెక్షన్స్ రాబట్డడంలో మాత్రం వెనకడుగు వేసింది. రిలీజైన రెండు రోజుల్లో కనీసం 10కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది షంషేరా. ఇప్పటికే కొన్ని థియేటర్‌లలో ప్రేక్షకులు రాకపోవడంతో షోలను కూడా రద్దు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడులకు రెడీ అయింది. 1800 కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
చదవండి: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు
కాగా ఈ చిత్రం ఆగస్టు రెండవ వారం నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. సాధారణంగా ఓ సినిమా రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తుంది. అలాంటిది స్టార్ హీరో అయిన రణ్‌బీర్ కపూర్ షెంషేరా మూవీ ఓటీటీకి వచ్చేందుకు నెలన్నరకుపైనే తీసుకోవాలి. కానీ డిజార్టర్‌గా నిలిచిన మూవీ విడుదలై నెలరోజులకు ముందే ఓటీటీకి రావడం ఆశ్చర్యం. దీని ఓటీటీ రిలీజ్‌పై దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా నటించాడు. వాణి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment