పెళ్లిలో మెరిసిన రష్మిక.. భర్తతో సంతోషంగా ఉండాలంటూ పోస్ట్!| Rashmika Mandanna Attends Childhood Friend Wedding In Kodagu | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: పెళ్లిలో తళుక్కుమన్న శ్రీవల్లి .. భర్తతో సంతోషంగా ఉండాలంటూ పోస్ట్!

Published Wed, Jun 26 2024 6:59 PM | Last Updated on Wed, Jun 26 2024 7:20 PM

Rashmika Mandanna attends childhood friend wedding in Kodagu

పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. గతేడాది రణ్‌బీర్‌ కపూర్ సరసన యానిమల్‌ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే రష్మిక తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది. కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులో స్నేహితురాలి వివాహానికి హాజరైంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ గురించి ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఫ్రెండ్‌ వివాహానికి హాజరైన రష్మిక సంప్రదాయ పద్ధతిలో చీరను ధరించింది.

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా హృదయం, నా చరిత్ర ఈ కొడగులోనే ఉంది. ఇక్కడ నేను, నా ఫ్రెండ్స్ కలిసి పెరిగాం. నీ పెళ్లిలో నువ్వు బిజీగా ఉన్నందున నీతో ఫోటో తీసుకోలేకపోతున్నాం. నువ్వు  నీ భాగస్వామితో జీవితాంతం ఆనందంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా..దేవుడా! మా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నా'  అంటూ పోస్ట్ చేసింది. తన స్నేహితురాళ్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

కాగా.. రష్మిక తల్లిదండ్రులు సుమన్, మదన్ మందన్న కొడగు జిల్లాలోని విరాజ్‌పేట పట్టణానికి చెందినవారు. రష్మిక చేతిలో ప్రస్తుతం  6 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.  పుష్ప 2: ది రూల్‌లో అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల తెరెకెక్కించనున్న ద్విభాషా చిత్రం కుబేరలో కూడా నటిస్తోంది. అంతే కాకుండా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్ అనే ప్రాజెక్ట్‌ల్లో కనిపించనుంది. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో చావా, సల్మాన్ ఖాన్ సరసన సికందర్‌లో నటించనున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్‌తో  గుడ్‌బైతో హిందీలో అడుగుపెట్టింది. చివరిసారిగా యానిమల్‌ చిత్రంలో మెరిసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement