టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కడా చూసిన పుష్ప గురించే చర్చ జరుగుతుంది. సినిమా ఎలా ఉంటుంది? ఎంత కలెక్షన్స్ కొల్లగొడుతుంది? ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుంది? అంటూ సినీ ప్రియులు లెక్కలు వేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడం, బన్నీ తొలిసారి పాన్ ఇండియా మూవీలో నటిస్తుండంతో ‘పుష్ప’పై తొలి నుంచే ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు అదిరిపోయాయి. మరో రెండు (డిసెంబర్ 17)రోజుల్లో థియేటర్లలో ‘పుష్ప’రాజ్ సందడి చేయనున్నాడు. ప్రస్తుతం పుష్ప టీమ్ ప్రమోషన్స్‌ను పరుగు పెట్టిస్తోంది. హీరో, హీరోయిన్స్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
(చదవండి: ఓ వారం పాటు బాగా నొప్పిగా ఉండేది.. తర్వాత అలవాటైంది: అల్లు అర్జున్)
ఇదిలా ఉంటే.. హీరోయిన్ రష్మిక మందన్నా .. ‘పుష్ప’లోని ‘రారా సామి’పాటకు స్టెప్పులేసి.. ఆ వీడియోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. ‘చాలా మంది ఈ పాటకు రీల్స్ చేస్తుండడం నేను చూశాను. అందుకే నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. నేను కూడా ఈ స్టెప్ వేసి పార్టీలో చేరుతున్నాను. నాలాగే ఇంకా చాలా మంది ఈ డ్యాన్స్ చేసి ఈ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో రష్మిక వేసిన స్టెప్పులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment