మేడమ్‌ని జాగ్రత్తగా చూసుకో ! | Rashmika Mandanna gives advise to kidambi srikanth | Sakshi
Sakshi News home page

మేడమ్‌ని జాగ్రత్తగా చూసుకో !

Nov 4 2024 1:03 AM | Updated on Nov 4 2024 1:19 AM

Rashmika Mandanna gives advise to kidambi srikanth

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా తనకంటూ గుర్తింపు పొందారు. అలాగే కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘గుడ్‌ లఖ్‌ సఖి’ సినిమాకి సహ నిర్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం రష్మికా మందన్న లీడ్‌ రోల్‌ చేస్తున్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్లు రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ, శ్రావ్య వర్మల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌తో శ్రావ్య త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

ఆగస్టు 10న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల శ్రావ్య వర్మ ఇచ్చిన బ్యాచిలరేట్‌ పార్టీకి రష్మికా మందన్న, వర్ష బొల్లమ్మ హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోని శ్రావ్య తన ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసి,‘నా గర్ల్‌ గ్యాంగ్‌తో సింగిల్‌గా ఇదే నా లాస్ట్‌ వీకెండ్‌’ అని పోస్ట్‌ చేశారు. దీనిపై రష్మిక స్పందిస్తూ..‘శ్రావ్య వర్మ మేడమ్‌ పెళ్లి చేసుకోనున్నారు. శ్రీకాంత్‌ కిదాంబి.. ఇకపై తను నీది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే’ అంటూ రిప్లై ఇస్తూ శ్రీకాంత్‌ని ట్యాగ్‌ చేశారు. ఇందుకు శ్రీకాంత్‌ స్పందిస్తూ ‘మహారాణిలా చూసుకుంటా’ అంటూ బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement