ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు గతేడాదే తనకు తెలిసిందని రియా చక్రవర్తి తెలిపారు. 2019 అక్టోబర్‌లో ఈ జంట యూరప్ ట్రిప్‌కు వెళ్లినట్లు, ఆ సమయంలో తనకు ఈ విషయం బయటపడిందని రియా వెల్లడించారు. గురువారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా మాట్లాడారు. ఈ సందర్భంగా సుశాంత్ గురించి పలు విషయాలు రియా వెల్లడించారు. తను ఓ షూట్ కోసం పారిస్ వెళ్లాలనుకుందని, అయితే సుశాంత్ యూరప్ టూర్‌కు వెళ్దామని తన ట్రిప్ రద్దు చేసి తన టికెట్స్ క్యాన్సల్ చేసినట్లు వెల్లడించారు. (సుశాంత్ మృతి కేసులో సంచలన నిజాలు)
సుశాంత్ మానసిక స్థితి గురించి ఎప్పుడు తెలుసుకున్నారని ప్రశ్నించగా.. తాము యూరప్ వెళ్ళేటప్పుడు, విమానంలో తనకు క్లాస్ట్రోఫోబిక్ అనిపిస్తుంది అని సుశాంత్ చెప్పినట్లు. అతను ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మోడాఫినిల్ అనే మందులు తీసుకున్నాడని పేర్కొన్నారు. సుశాంత్‌కు విమాన ప్రయాణం అంటే భయం ఉండేదని, విచిత్రమైన బొమ్మలు, చిత్రాలు చూసినా సుశాంత్ వింతగా ప్రవర్తించేవాడని రియా తెలిపారు. పారిస్ చేరుకున్నాక అతను మూడు రోజులు తన గదిని విడిచి రాలేదని, ట్రిప్‌కు ముందు సుశాంత్ చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపారు. యూరప్ విధుల్లో నా చేయి పట్టుకొని సంతోషంగా తిరగాలని ఉందని తనతో చెప్పాడని, అక్కడ తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. (రియాకు మద్దతు.. కసబ్ కన్నా దారుణంగా)
ఆమె మాట్లాడుతూ, "స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు అతను బాగానే ఉన్నాడు. మేము ఇటలీకి చేరుకున్నప్పుడు గోతిక్ అనే హోటల్‌లో బస చేశాము. అక్కడ మా గదిలో నిర్మాణం వంటి గోపురం ఉంది. ఇది నాకు నచ్చలేదు. మనం హోటల్ మారుదాం అని అడిగాను.కానీ , కాని అతను అక్కడే ఉండాలని పట్టుబట్టాడు. అయితే క్రమంగా అక్కడ అతని ఆరోగ్యం క్షీణించింది. ఏం అయ్యిందని నేను అడిగాను. 2013 లో రేష్‌శెట్టి అనే సైకాలజిస్ట్‌ను కలిసినట్లు నాకు తెలిపాడు. అతనే మోడాఫినల్ అనే మందును సలహా ఇచ్చాడని తెలిపాడు. ఆ తర్వాత బాగానే ఉన్నాడని చెప్పి కొన్ని రోజులకు తిరిగి ఇండియా వచ్చాం.’ అని తెలిపారు. (రియా చక్రవర్తిపై నార్కోటిక్ కేసు)
కాగా రియా, సుశాంత్ యూరప్ ట్రిప్‌లో ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా వెళ్లాడు. ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నా సోదరుడు షోయిక్ కూడా సుశాంత్‌తో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. సుశాంత్, షోయిక్, నేను రియాలిటీక్స్ అనే సంస్థలో భాగస్వాములం. సుశాంత్ ఈ కంపెనీకి నా పేరు పెట్టాడు. ఇది కృత్రిమ మేధస్సుతో వ్యవహరిస్తుంది. కంపెనీలో భాగస్వామి కావాలంటే ఒకరు రూ .33 వేలు చెల్లించాలి. షోయిక్‌కు ఉద్యోగం లేనందున చెల్లించే పరిస్థితి లేకపోవడంతో నేను చెల్లించాను. షోయిక్ క్యాట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు ఆ సమయంలో మాతో ట్రిప్‌కు రావాలా వద్దా అని ఆలోచిస్తుంటే సుశాంత్ రావాలని పట్టుబట్టాడు.’ అని పేర్కొన్నారు. (‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’)
రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డబ్బుతో జీవిస్తున్నారనే ఆరోపణపై ఆమె స్పందించారు. ‘యూరప్ ట్రిప్‌లో హోటల్ ఖర్చులను సుశాంత్ చెల్లించాడు.. టూర్‌లో సుశాంత్ ఎక్కువగా ఖర్చు చేశారని అనుకుంటున్నాను. కానీ అతన్ని ప్రశ్నించేందుకు నేను ఎవరు అని ఊరుకున్నారు. ఈ టూర్ కంటే ముందు సుశాంత్ తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ జెట్ బుక్ చేసుకొని దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అంటే సుశాంత్ విలాసవంతమైన లైఫ్ గడిపేవాడు. సుశాంత్ ఎలా బతకాలన్నది ఆయన నిర్ణయం మాత్రమే.. నా వల్లే ఆయన విలాసాలు చేశాడన్నది పూర్తి అవాస్తవం. నేను సుశాంత్ డబ్బులతో జీవించడం లేదు.’ అని రియా చక్రవర్తి స్పష్టం చేశారు. (డ్రగ్ డీలర్‌తో రియా చాట్.. అరెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment