రామ్‌చరణ్.. ఇప్పుడీ పేరొక ప్రభంజనం.. మగధీర, ధ్రువ, రంగస్థలం వంటి పలు చిత్రాల్లో విలక్షణ నటనతో కట్టిపడేశాడీ మెగా హీరో. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజుగా ప్రేక్షకులను మరోసారి ఫిదా చేశాడు. తక్కువకాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు సినీ లైఫ్‌తో పాటు అటు పర్సనల్ లైఫ్‌ను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నాడీ హీరో. 2012లో ఉపాసనను పెళ్లి చేసుకున్న చెర్రీ వీలు దొరికినప్పుడల్లా భార్యతో విహారయాత్రకు వెళ్తాడు.
ఇదిలా ఉంటే ఈరోజు(మార్చి 27) రామ్‌చరణ్ బర్త్‌డే. దీంతో సోషల్ మీడియాలో అతడికి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చెర్రీ మాత్రం ఎప్పటిలాగే తారక్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా అతడి ఇంటి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఆ మధ్య చరణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక ఇల్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే కదా! ఈ ఇంటిని చెర్రీ దంపతులు మరింత అందంగా కనిపించేలా మార్పుచేర్పులు చేశారు. ఇంటర్నేషనల్ స్టైల్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, స్విమ్మింగ్ పూల్, పెయింటింగ్స్, జిమ్ సకల సదుపాయాలు ఉన్న ఈ ఇంటిని మరింత మోడ్రన్‌గా కనిపించేలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సుమారు 25వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఇంటిని సొంతం చేసుకోవడం కోసం మెగా హీరో రూ.30 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఇంటినుంచి బయట అందాలు కనిపించేలా చాలా గదుల్లో అద్దాలు అమర్చారు. చిన్నపాటి దేవాలయాన్ని గుర్తుచేసేలా రాళ్లతో ఓ పూజామందిరాన్ని నిర్మించారు. కొన్ని గదుల్లో మొక్కలు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని ఇష్టపడే రామ్‌చరణ్ తను తీసిన ఎన్నో ఫొటోలను ఫ్రేము కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.
చెర్రీకి హైదరాబాద్‌లోనే కాకుండా ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది. పోష్ ప్రాంతం ఖర్‌లో విలాసవంతమైన ఇల్లు ఆయన సొంతం. ఈ ఇంటినుంచి చూస్తే సముద్ర తీరం కనిపించడం ఈ ఇంటి ప్రత్యేకత.
చదవండి: మీటూపై అనుచిత వ్యాఖ్యలు, సారీ చెప్పిన నటుడు
బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం, రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?
Comments
Please login to add a commentAdd a comment