
ఆర్ఆర్ఆర్... ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో ఐదు(మార్చి 25) రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. రోజుకో నగరం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో నిర్వహించారు. నేడు(మార్చి 20) బరోడా(గుజరాత్), ఢిల్లీలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి కర్ణాటక నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్లారు.
ఈ త్రయం గుజరాత్‌లోని స్టాచ్యు ఆఫ్ యూనిటీ దగ్గర సందడి చేసింది. అక్కడే మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వ్లెడించారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ గుజరాత్‌లో ల్యాండ్ అయినా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.కాగా ఈ ప్రోగ్రాంకి గాను అక్కడి యూనిట్ ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టిక్కర్స్ తో పలు కార్లను రోడ్ షో నిమిత్తం రెడీ చెయ్యడం మరింత ఆసక్తిగా మారిపోయింది.
The RRR fleet…Enroute Kevadia, Gujarat.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/4UrX7rIDUA
— RRR Movie (@RRRMovie) March 20, 2022
ఇక ఆర్‌ఆర్‌ఆర్ విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.
#RRRMovie team interacts with the media at the Statue of Unity.#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/eEW7mABdGi
— RRR Movie (@RRRMovie) March 20, 2022
Comments
Please login to add a commentAdd a comment