![Salaar: Prabhas Take Rest For Another Month After Knee Surgery - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/9/prabhas.jpg.webp?itok=l5j2fzKx)
Prabhas Will Take Rest For Another Month: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే ఉన్నాయి. ఇటీవల ఆయన నటించిన రాధేశ్యామ్ రిలీజైంది. ఇక సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలు షూటింగ్‌ను జరుపుకుంటుండగా ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారందరికి షాకిచ్చే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండే రాధేశ్యామ రిలీజ్ అనంతరం ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలార్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ప్రభాస్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు పడుతుందని మొదట్లో వార్తలు వచ్చాయి.
చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
అయితే ఈ తాజా బజ్ ప్రకారం ప్రభాస్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకో నెల సమయంలో పడుతుందట. అంటే దాదాపు 3 నెలలపైనే ప్రభాస్ రెస్ట్ మోడ్‌లోనే ఉండనున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. దీంతో సలార్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సలార్ షూటింగ్ 60శాతం కూడా పూర్తికాలేదు. అయితే వచ్చే ఏడాది సలార్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభాస్ సర్జరీ కారణంగా షూటింగ్ పూర్తయ్యేసరికి మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. కాబట్టి ఈ యాక్షన్ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment