Salaar Movie: Shooting updates and more | Details Inside- Sakshi
Sakshi News home page

Salaar: ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇవ్వనున్న ఫైట్‌ సీన్‌!

Published Sat, Aug 7 2021 12:07 AM | Last Updated on Sat, Aug 7 2021 1:17 PM

Prabhas Salaar Movie Shooting Night For Action Scene - Sakshi

ప్రభాస్‌

Salaar Movie: ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో శ్రుతీహాసన్‌ కూడా జాయిన్‌ అయ్యారని సమాచారం. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొంత నైట్‌ షూట్‌ కూడా జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకోసం విలన్‌ ఉండే ఓ డెన్‌ సెట్‌ను తయారు చేయించారట. ప్రభాస్‌ పాల్గొనే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాలో ఓ హైలైట్‌గా ఉంటుందట. ఈ ఫైట్‌ సీన్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement