![Salman Khan Shares Video To Wish Friend Marriage Anniversary - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/9/4.gif.webp?itok=QuB5JSSI)
వద్దురా, సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. అని ఎప్పటి నుంచో పాడుతూనే ఉన్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఒకరికి చెప్పడమే కాదు, తను కూడా పెళ్లి ఊసెత్తకుండా బ్యాచిలర్‌గానే కాలం వెళ్లదీస్తున్నాడు. సోమవారం ఆయన తన చిన్ననాటి స్నేహితుడు సాదిక్‌కు మ్యారేజ్‌డే విషెస్ తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు.
"33 ఏళ్ల క్రితం అంటే నేనెంతో చిన్నగా ఉన్నప్పుడు సాదిక్ పెళ్లి చేసుకున్నాడు. అతడిని ఇన్నేళ్లుగా భరిస్తూ వైవాహిక జీవితాన్ని నెట్టుకొస్తున్న రెహానాను అభినందించాల్సిందే. ఏదేమైనా మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు. కానీ రెహానా.. ఇప్పటికీ ఆ బంధంలో నుంచి బయటపడే ఛాన్స్ ఉంది సుమా.." అని ఛమత్కరిస్తూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగన్నర లక్షలమందికి పైగా వీక్షించారు.
సల్మాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు అంతిమ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అందులో సిక్కు పోలీసాధికారి పాత్రను పోషిస్తున్నాడు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరాఠీ సినిమా ముల్షికి రీమేక్. ఇక ఆయన నటించిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమా ఈద్ పండగ రోజు రిలీజవుతోంది. ఇందులో దిశా పటానీ, రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కత్రినా కైఫ్‌తో కలిసి టైగర్ 3లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో దుబాయ్‌లో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment