బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కనిపిస్తే చాలు తను కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో ఆడుకుంటాడు. పిల్లలతో ఆడుకుంటే సమయమే తెలియదంటాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతోమందితో ఆఫ్ స్క్రీన్‌లోనూ లవ్‌లో పడ్డ హీరో ఎవరితోనూ జీవితం పంచుకునేదాకా వెళ్లలేదు. ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్న ఈ హీరోకు ఓ చిన్నారిని పెంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
తాజాగా ఓ షోకి హాజరైన సల్మాన్ ఖాన్.. 'ఇప్పుడు మా ఇంటికి కోడలిని తీసుకురావాలన్న ఆలోచన లేదు కానీ ఓ పాపను తీసుకొచ్చి పెంచుకోవాలనుకుంది. కానీ మన భారతీయ చట్టాలు దాన్ని సాధ్యపడనిస్తాయో, లేదో తెలియదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం' అని చెప్పుకొచ్చాడు. కానీ పెళ్లి గురించి మాత్రం ఇప్పటికీ ఇంట్రస్ట్ లేదన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. అంటే సల్లూ భాయ్ పెళ్లి చేసుకోకుంతడానే నాన్న అని పిలిపించుకోవడానికి ఆరాటపడుతున్నాడు. మరి ఈ హీరో కోరిక నెరవేరుతుందో, లేదో చూడాలి!
కాగా సల్మాన్.. ఇటీవల 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. వెంకటేశ్, జగపతిబాబు, షెహనాజ్ గిల్, భూమిక, పాలక్ తివారి, రాఘవ్, జెస్సీ గిల్, సిద్దార్థ్ నిగమ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంది. కానీ సల్మాన్ రేంజ్‌కు తగ్గ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. ఇకపోతే సల్లూ భాయ్ 'టైగర్ 3' సినిమాలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.
చదవండి: నువ్వు కూతురిని చూసుకో, ఐశ్వర్యను సినిమాలు చేయనివ్వు
సింగిల్‌గా ఉంటున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి
Comments
Please login to add a commentAdd a comment