ట్రా లా లాలో రెండో సినిమా? | Samantha kick starts the shoot of her Second Production: Tollywood | Sakshi
Sakshi News home page

ట్రా లా లాలో రెండో సినిమా?

Published Wed, Oct 30 2024 12:06 AM | Last Updated on Wed, Oct 30 2024 12:06 AM

Samantha kick starts the shoot of her Second Production: Tollywood

హీరోయిన్‌ సమంత ఇటీవల ఓ కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సినిమా బండి’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలిచి, ఇటీవల ‘పరదా’ (ఇంకా రిలీజ్‌ కావాల్సి ఉంది) చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు ప్రవీణ్‌ కంద్రేగుల కథకు సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందనే టాక్‌ వినిపిస్తోంది. 

తన సొంత నిర్మాణసంస్థ ‘ట్రా లా లా’పై ఈ సినిమాను సమంత నిర్మిస్తున్నారని, త్వరలోనే ప్రకటన రానుందని భోగట్టా. ‘ట్రా లా లా’ బ్యానర్‌పైనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతంలో ప్రకటించారు సమంత. కానీ ఆ తర్వాత మరో అప్‌డేట్‌ రాలేదు. ఈలోపు ఈ బేనర్‌పై మరో సినిమా అంటూ... రెండో సినిమా గురించిన వార్త ప్రచారంలోకి వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement