Samantha: Looking For Suitable Match For Him - Sakshi
Sakshi News home page

Samantha: సూటబుల్‌ మ్యాచ్‌ కోసం వెతుకుతున్నానన్న సామ్‌

Published Sat, May 20 2023 2:18 PM | Last Updated on Sat, May 20 2023 2:55 PM

Samantha: Looking For Suitable Match For Him - Sakshi

మంచి జోడీ కోసం వెతుకుతున్నానంటోంది హీరోయిన్‌ సమంత. కాకపోతే ఆ జోడీ తనకోసం కాదు, సెలబ్రిటీలకు వైద్యం చేసే డాక్టర్‌ జెవల్‌ గమాడియా కోసం! 'డాక్టర్‌ జెవల్‌ గమాడియాకు సరిపోయే మ్యాచ్‌ కోసం వెతుకుతున్నాం. అతడు కనిపించేదానికంటే తెలివైనవాడు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది సామ్‌.

ఇంతకీ ఈ డాక్టర్‌ ఎవరా? అనుకుంటున్నారా? అతడి చేత వైద్యం తీసుకున్నవాళ్ల లిస్టులో అనేక మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఉన్నారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌.. ఇలా ఎందరో తారలు ఆయన దగ్గరే ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. సెలబ్రిటీలకు ఆయన వెస్టర్న్‌ అక్యుపెంచర్‌ ద్వారా చికిత్స అందిస్తారు. సమంత పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే తాజాగా తను కూడా ఆ జాబితాలో చేరిపోయినట్లు తెలుస్తోంది.

ఇక ఆమె పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. తను విడాకులు తీసుకున్నప్పటికీ వివాహ బంధంపై నమ్మకం మాత్రం అలాగే ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా సమంత చివరగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఇందులో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అలాగే సామ్‌ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేస్తోంది.

చదవండి: ఇదంత సులువు కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement