
స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. వరుస ప్రాజెక్టులను సైన్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత పెట్టే పోస్టులు ఇటీవలి కాలంలో చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరినో ఉద్దేశించి కావాలనే సమంత ఈ కామెంట్స్ చేస్తుందా అని పలువురు భావిస్తున్నారు.
తాజాగా సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. నిజాలు అనేది అరుదుగా బయటకు వస్తాయి కానీ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారంలో ఉంటాయి.. అంతేకాదు అబద్ధాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది అంటూ సమంత చేసిన కోట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ హాలీవుడ్ సినిమాకు సంబంధించి సమంత ఈ పోస్ట్ చేసిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, పర్సనల్ లైఫ్ విషయాలతో లింక్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment