Samantha Gym Trainer Juniadh Shaik Compared Her With Virat Kohli, Know Details - Sakshi
Sakshi News home page

Samantha: సమంతను విరాట్‌ కోహ్లితో పోల్చిన జిమ్‌ ట్రైనర్‌ జునైద్‌

Published Thu, Mar 3 2022 3:11 PM | Last Updated on Thu, Mar 3 2022 5:50 PM

Samantha ZYM Trainer Juniadh Shaik Intresting Comments - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫిట్‌నెస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అందరికి తెలిసిందే. తన డైలీ రోటిన్‌లో వ్యాయామంకు తప్పనిసరిగా ఉంటుంది. ఇక తరచూ సమంత జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ వంటి కష్టమైన కసరత్తులను కూడా అలోవోకగా చేసేస్తోంది సమంత. దీన్ని బట్టి సమంత జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతుందో అర్థమవుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు తన జిమ్‌ ట్రైనర్‌ జునైద్ షేక్‌ గురించి కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన వర్కౌట్స్‌ ట్రైనర్‌ జునైద్‌ ఎంతగా ఎంకరేజ్‌ చేస్తుంటాడో కూడా వివరిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల జునైద్‌ ఓ యూట్యూబ్‌కు చానల్‌తో ముచ్చటించాడు.

చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్‌

ఈ సందర్భంగా ఆయన సమంతపై ప్రశంసలు కురిపించాడు. ‘ఒకవేళ స‌మంత అథ్లేట్‌ అయ్యింటే విరాట్ కోహ్లీలా ఉండేది. నేను ఎంత కష్టమైన వ్యాయామం చెప్పినా స‌మంత మరొక్క‌సారి చెయ్యి నేను ప్రయత్నిస్తా అంటుంది కాని చెయ్యను అని ఎప్పుడూ చెప్పదు. సామ్‌ చాలా దూకుడుగా ఉంటుంది. క‌ష్ట‌మైన ప‌నులు చేయాల‌నుకుంటుంది. సమంతని చూసి నేను స్పూర్తి పొందుతాను. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆమె వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ‘పుష్ప’ సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా సాంగ్ కోసం సమంత చాలా వ‌ర్క‌వుట్ చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఆగిపోయిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ లైవ్‌ స్ట్రీమింగ్‌, అసలేమైందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement