గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా పి. నవీన్‌కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా శాండీ.
∙పోసాని కృష్ణ మురళి, గౌతం కృష్ణ, శ్వేత
Comments
Please login to add a commentAdd a comment