Shamshera Trailer Launch Event: Ranbir Kapoor Met With An Accident - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor Accident: రణ్‌బీర్‌ కపూర్‌ కారుకు యాక్సిడెంట్‌

Published Fri, Jun 24 2022 4:04 PM | Last Updated on Fri, Jun 24 2022 4:27 PM

Shamshera Trailer Launch Event: Ranbir Kapoor Car Met With Accident - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ సినిమా టీజర్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ లభించిన విషయం తెలిసిందే! కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ శుక్రవారం విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యే క్రమంలో రణ్‌బీర్‌ కారుకు యాక్సిడెంట్‌ అయింది. అయితే ఈ ప్రమాదంలో హీరోకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్‌ ఊపిరిపీల్చుకుంది. షంషేరా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో రణ్‌బీర్‌  తన కారుకు యాక్సిడెంట్‌ అయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

'నిజానికి నేను కరెక్ట్‌ టైంకి ఉండేవాడినే. కానీ దారిలో ఓ వ్యక్తి మా కారును ఢీ కొట్టడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టమంటే ఇదే, ఈ ప్రమాదం నుంచి మేము క్షేమంగా బయటపడ్డాం. ఇకపోతే సంజు సర్‌(షంషేరాలో విలన్‌గా నటించిన సంజయ్‌ దత్‌)కి నేను పెద్ద అభిమానిని. మేము కలిసి చేసిన ఈ మూవీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్‌ తెలిపాడు. షంషేరా మూవీ జూలై 22న విడుదల కానుంది. ఆ తర్వాత రణ్‌బీర్‌, ఆలియా నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్‌ 9న రిలీజ్‌ కాబోతోంది.

చదవండి: నిర్మాత ఇంట మోగిన పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ఆకాష్ పూరి 'చోర్‌ బజార్‌' సినిమా రివ్యూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement